Team India: చివరి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా... ఓపెనర్లు విఫలం

Team India openers failed in 5th T20I against West Indies
  • అమెరికాలో మ్యాచ్
  • ఐదో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • భారత్ ను దెబ్బతీసిన విండీస్ స్పిన్నర్ అకీల్ హోసీన్
  • 17 పరుగులకే రెండు వికెట్లు 
టీమిండియా, వెస్టిండీస్ మధ్య ఐదు టీ20ల సిరీస్ లో చివరి మ్యాచ్ నేడు అమెరికా లోని లాడర్ హిల్ లో ప్రారంభమైంది. ఇక్కడి సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. 

అయితే, 3 ఓవర్లలోపే ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరడంతో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యశస్వి జైస్వాల్ 5, శుభ్ మాన్ గిల్ 9 పరుగులు చేశారు. నాలుగో టీ20లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేసిన ఈ జోడీ... నేటి మ్యాచ్ లో విండీస్ స్పిన్నర్ అకీల్ హోసీన్ కు వికెట్లు అప్పగించింది. 

ప్రస్తుతం టీమిండియా స్కోరు 4 ఓవర్లలో 2 వికెట్లకు 24 పరుగులు. సూర్యకుమార్ యాదవ్ 8 తిలక్ వర్మ 0 పరుగులతో ఆడుతున్నారు.
Team India
West Indies
5th T20I
USA

More Telugu News