Pawan Kalyan: గాజువాక నా నియోజకవర్గం... జగన్ కు గెలుపు ఇచ్చి నాకు ఓటమిని ఇచ్చింది: పవన్ కల్యాణ్

Pawan Kalyan speech in Gajuwaka
  • గాజువాకలో పవన్ కల్యాణ్ భారీ బహిరంగ సభ
  • జగన్ దోపిడీదారుడు అని తెలిసి కూడా గత ఎన్నికల్లో నమ్మారని వెల్లడి
  •  ఇదే గాజువాకలో తనకు ఇవాళ అఖండ స్వాగతం లభించిందన్న పవన్
  • 2024లో గాజువాకలో గెలిచేది జనసేన పార్టీయేనని ధీమా
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గాజువాకలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, గాజువాక తన నియోజకవర్గం అని వెల్లడించారు. 

ఒక ఆశయంతో ఈ నియోజకవర్గంలో పోటీ చేశానని, కానీ దోపిడీ చేస్తాడు అని తెలిసి కూడా ఈ నియోజకవర్గం జగన్ కు గెలుపును ఇచ్చి, తనకు ఓటమిని ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇవాళ ఇదే గాజువాక నియోజకవర్గంలో తనకు ప్రజల నుంచి అఖండ స్వాగతం లభించిందని, తాను ఇక్కడ ఓడిపోయిన విషయం తెలియనంత గొప్ప స్వాగతం లభించిందని, ఇంతటి ప్రేమను తాను ఊహించలేదని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల కోసం విశాఖలో సభ అంటే భయపడ్డానని, కానీ 2 లక్షలకు పైగా జనం వచ్చి, ఆశయంతో ఉన్న వాడికి గెలుపోటములు అతీతం అని నిరూపించేలా నిలబడ్డారని పవన్ కల్యాణ్ కొనియాడారు. 

2024లో గాజువాకలో గెలిచేది జనసేన పార్టీయేనని ఢంకా బజాయించారు.
Pawan Kalyan
Gajuwaka
Janasena
Visakhapatnam

More Telugu News