Team India: అజేయంగా ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్​

  • ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ హాకీలో టీమిండియా జోరు
  • సెమీస్‌లో 5–0తో జపాన్‌పై ఘన విజయం
  • రేపు మలేసియాతో ఫైనల్‌ ఫైట్‌
 Indian hockey team records dominant win over Japan to enter final in Asian Champions Trophy 2023

స్వదేశంలో జరుగుతున్న ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత పురుషుల జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత్ ఫైనల్‌ కు చేరుకుంది. నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్లో 5–0తో గత ఎడిషన్ రన్నరప్ జపాన్‌ను చిత్తు చేసింది. ఆకాశ్‌దీప్‌ సింగ్‌ (19వ నిమిషం), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (23వ ని), మన్‌దీప్‌ సింగ్‌ (30వ ని), సుమిత్‌ (39వ ని), సెల్వమ్ కార్తి (51వ ని) తలో గోల్‌తో జట్టును గెలిపించారు. 

భారత గోల్‌ కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్‌ అడ్డు గోడగా నిలవడంతో జపాన్‌ ఒక్క గోల్‌ కూడా కొట్టలేకపోయింది.  ఆదివారం జరిగే ఫైనల్లో మలేసియాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీఫైనల్లో మలేసియా 6–2తో కొరియాను ఓడించింది. కాగా, ఈ టోర్నీలో భారత్ ఫైనల్ చేరడం ఇది ఐదోసారి కాగా.. మలేసియాకు మొదటిసారి. భారత్ ఇప్పటికే మూడుసార్లు విజేతగా నిలిచింది.

More Telugu News