Rajinikanth: తొలి రోజే రికార్డులు బ్రేక్ చేసిన 'జైలర్' వసూళ్లు

  • నిన్న తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన జైలర్  
  • భారత్ లో మొదటి రోజు రూ. 49 కోట్ల కలెక్షన్స్
  • పీఎస్2 రికార్డును బద్దలు కొట్టిన రజనీకాంత్ సినిమా
Jailer Day 1 box office collections shatters records

రజనీకాంత్ హీరోగా వచ్చిన చిత్రం 'జైలర్'. తమిళ, తెలుగు భాషల్లో ఈ రోజునే విడుదలైంది. సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. టైటిల్, పోస్టర్లు, టీజర్, ట్రైలర్ తో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచింది. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ సాధించింది. భారత బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు ఈ చిత్రం సుమారు రూ. 49 కోట్లు వసూలు చేసి పలు రికార్డులు బ్రేక్ చేసింది. సౌత్ లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన తమిళ చిత్రంగా తిరువు, పొన్నియన్ సెల్వన్ 2 చిత్రాల రికార్డులు బద్దలు కొట్టింది. 

అమెరికాలో ప్రీమియర్స్, మొదటి రోజు కలిపి 1.450 మిలియన్ డాలర్లు రాబట్టింది. నెల్సన్ దర్శకత్వం వహించిన గత చిత్రం బీస్ట్ సాధించిన 1.375 మిలియన్ డాలర్ల ఓపెనింగ్ రికార్డును బ్రేక్ చేసింది. ఈ చిత్రంలో తమన్నా, రమ్యకృష్ణ, జాకీష్రాఫ్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

More Telugu News