శంషాబాద్ లో దిశ తరహా ఘటన.. మహిళను హత్య చేసి కాల్చేసిన దుండగులు
- సాయి ఎన్ క్లేవ్ లో ఇళ్ల స్థలాల మధ్య మృతదేహం లభ్యం
- కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న ఎయిర్ పోర్టు పోలీసులు
- పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు
ఈ మేరకు శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ నిర్వహిస్తున్నారు. ఆ మహిళ ఎవరు? ముందుగానే చంపేసి అక్కడకు తీసుకొచ్చి తగులబెట్టారా? అత్యాచారం ఏమైనా జరిగిందా? అనే అంశాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కేసు విచారణకు నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.