Dil Raju: 'జైలర్' బ్లాక్ బస్టర్ హిట్ .. థియేటర్స్ పెంచుతున్నాం: దిల్ రాజు

  • ఈ రోజునే విడుదలైన 'జైలర్'
  • తొలి ఆటతోనే హిట్ టాక్ 
  • సక్సెస్ మీట్ ను నిర్వహించిన టీమ్ 
  • ఆనందాన్ని వ్యక్తం చేసిన దిల్ రాజు
Jailer movie Success Meet

రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించిన 'జైలర్' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆటతోనే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఒక తండ్రిగా .. తాతగా .. సమాజం పట్ల బాధ్యత కలిగిన ఒక 'జైలర్' గా ఈ సినిమాలో రజనీకాంత్ విజృంభించారు. ఆయన స్టైల్ పైనే దర్శకుడు పూర్తి ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. 
 
కొంతసేపటి క్రితం జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ .. "ఏసియన్ వారితో కలిసి ఈ సినిమాను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇటు ఇండస్ట్రీ నుంచి, అటు జనాల నుంచి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే మాట వినిపిస్తోంది. థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆంధ్రాలో థియేటర్ల సంఖ్యను పెంచుతున్నాము" అని అన్నారు. 

ఈ సినిమా చూసినవారు ఫస్టాఫ్ చాలా బాగుందనీ .. సెకండాఫ్ కాస్త స్లోగా సాగి .. ఆ తరువాత అందుకుందని అంటున్నారు. ఏదేమైనా రజనీకాంత్ గారికి చాలా కాలం తరువాత పెద్ద హిట్ పడింది. నంబర్స్ గురించి మండే తరువాత మాట్లాడదాం .. అప్పటివరకూ ఈ సినిమా సూపర్ హిట్ అనే విషయం గురించి మాత్రమే మాట్లాడుకుందాం" అంటూ ముగించారు. 

More Telugu News