Nagababu: రజనీకాంత్‌తో నటించడంపై నాగబాబు ట్వీట్

  • కోట్ల మంది మాదిరే తానూ రజనీకాంత్ అభిమానినన్న నాగబాబు
  • రజనీతో ఓ చిన్న సీన్‌లో కనిపించడం ఆనందంగా ఉందని వెల్లడి
  • జైలర్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని ఆకాంక్ష
mega brother nagababu tweet about superstar rajinikanth

‘జైలర్’ సినిమా విడుదలతో సూపర్‌‌స్టార్‌‌ రజనీకాంత్‌ మేనియా మొదలైంది. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ తదితర సూపర్‌‌ స్టార్లతోపాటు ఈ చిత్రంలో మెగా బ్రదర్ నాగబాబు చిన్న పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో నాగబాబు ఓ ట్వీట్ చేశారు. రజనీకాంత్‌పై తనకున్న అభిమానాన్ని తెలియజేశారు. జైలర్‌‌ సినిమా షూటింగ్‌ సమయంలో తీసుకున్న ఫొటోలు, రజనీకాంత్ ఫొటోలతో ఓ వీడియోను షేర్ చేశారు. దానికి ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చారు.

‘‘కోట్ల మంది మాదిరే నేను కూడా రజనీకాంత్ అభిమానిని. అన్నయ్య చిరంజీవితోపాటు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ మీద తెలియని అభిమానం ఉండేది. ముగ్గురూ కష్టపడి పైకొచ్చారు. రజనీ, అమితాబ్ అంటే ఓ సోదరుల్లా మాకు అభిమానం ఉంటుంది. ఇప్పుడు రజనీతో ఓ చిన్న సీన్‌లో కనిపించడం చాలా ఆనందంగా ఉంది. జైలర్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా” అని నాగబాబు పేర్కొన్నారు.

More Telugu News