Tv Setup Box: టీవీ సెట్‌టాప్‌ బాక్స్‌ షాక్ కొట్టి నాలుగేళ్ల బాలుడి మృతి

  • మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘటన
  • కార్టూన్లు చూస్తూ కేరింతలు
  • సెట్‌టాప్ బాక్స్ లాగడంతో విద్యుదాఘాతం
Four Year Old Boy Died With Current Shock In Maharashtra

టీవీ సెట్‌టాప్ బాక్స్ షాక్ కొట్టిన ఘటనలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిందీ ఘటన. టీవీలో కార్టూన్లు చూస్తూ కేరింతలు కొడుతున్న కుమారుడు అంతలోనే విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇంట్లో తండ్రి నిద్రిస్తుండగా, తల్లి వేరే పనుల్లో ఉంది. ఆ సమయంలో పిల్లాడు ఒంటరిగా టీవీలో కార్టూన్లు చూస్తున్నాడు. ఈ క్రమంలో సెట్‌టాప్ బాక్స్‌ను లాగే ప్రయత్నం చేయడంతో అది ఒక్కసారిగా షాక్ కొట్టింది. దీంతో పిల్లాడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News