తిరుపతి - సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్లో పొగలు!
- నెల్లూరు జిల్లా మనుబోలు రైల్వే స్టేషన్ వద్ద అరగంట పాటు నిలిచిన రైలు
- బాత్రూంలో సిగరెట్ ముక్క ప్లాస్టిక్కు అంటుకోవడంతో పొగ వ్యాప్తి చెందినట్లు గుర్తింపు
- టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న వ్యక్తి అరెస్ట్
మూడో బోగీలోని బాత్రూమ్ నుండి పొగలు రావడంతో సిబ్బంది వెళ్లి తనిఖీ చేశారు. అయితే కాల్చిపడేసిన సిగరెట్ ముక్క ప్లాస్టిక్ సామగ్రికి అంటుకోవడంతో పొగ వ్యాప్తిచెందినట్లు గుర్తించారు. ఈ ఘటనకు టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న వ్యక్తి కారకుడని గుర్తించిన పోలీసులు, అతనిని అదుపులోకి తీసుకున్నారు. మంటలను పూర్తిగా ఆపివేసి, రైలును పంపించారు. దీంతో అరగంట పాటు రైలు నిలిచిపోయింది.