Pawan Kalyan: ఈ షార్ట్ ఫిలిం మనకు చాలా నేర్పిస్తుంది: పవన్ కల్యాణ్

  • ఓ ఆసక్తికర షార్ట్ ఫిలింను ట్వీట్ చేసిన జనసేన శతఘ్ని
  • ఇది సమష్టి సామాజిక ఆలోచన విధానానికి ప్రతీక అని పేర్కొన్న పవన్
  • తోటి వారికి అన్యాయం జరుగుతుంటే వారికి అండగా గళం విప్పాలని పిలుపు
Pawan Kalyan opines on a short film shared by Janasena Shatagni

జనసేన పార్టీ డిజిటల్ విభాగం 'జనసేన శతఘ్ని' షేర్ చేసిన ఓ షార్ట్ ఫిలిం (Soul Stories by Fearless Soul)ను జనసేనాని పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పంచుకున్నారు. ఈ షార్ట్ ఫిలిం మనకు చాలా నేర్పిస్తుందని పవన్ వెల్లడించారు. ఓ క్లాస్ రూంలో జరిగిన ప్రయోగాత్మక సంభాషణ సమష్టి సామాజిక ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తుందని పవన్ వివరించారు. "తోటివారికి అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు వారికి అండగా గళం ఎత్తాలి. వారి కోసం నిలబడాలి. సమస్య మనది కాదు అని మౌనంగా ఉంటే రేపు ఆ సమస్య మీకు వచ్చినప్పుడు అండగా నిలబడేందుకు ఎవరూ ఉండరు" అని సూచించారు.

More Telugu News