Pawan Kalyan: అర్చకుడిపై దాడి అధికార పార్టీ దాష్టీకానికి ప్రతీక: పవన్ కల్యాణ్
భీమవరం పంచారామక్షేత్రం సోమేశ్వరస్వామి ఆలయంలో అర్చకుడిపై వైసీపీ నేత దాడి చేయడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఎవరి కళ్లలో ఆనందం కోసం అర్చకుడిపై దాడి చేసి యజ్ఞోపవీతాన్ని తెంచారని నిలదీశారు. ఇది పాలక వర్గం అహంభావానికి, దాష్టీకానికి ప్రతీక అని ఆగ్రహం వ్యక్తం చేశారు.