మూడు జిల్లాల్లోని భూముల వేలానికి హెచ్ఎండీఏ నోటిఫికేషన్
- రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్ గిరి, సంగారెడ్డి జిల్లాల్లో వేలం
- చదరపు గజం కనీస ధర రూ.12 వేలు, గరిష్ఠ ధర రూ.65 వేలు
- ఈ వేలంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ గడువు ఆగస్టు 16
నోటిఫికేషన్ లో వెల్లడించిన వివరాల ప్రకారం ఈ భూములకు చదరపు గజానికి కనీస ధర రూ.12 వేలు, గరిష్ఠ ధర రూ.65 వేలుగా హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఆన్ లైన్ లో జరగనున్న ఈ వేలంలో పాల్గొనేందుకు ఈ నెల 16 లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 18 నుంచి ఈ-వేలం ద్వారా భూముల విక్రయం జరగనుందని తెలిపారు. పూర్తి వివరాలకు హెచ్ఎండీఏ వెబ్ సైట్ సందర్శించాల్సిందిగా అధికారులు సూచించారు.