Nadendla Manohar: జగన్ మాట తప్పారు.. మడమ తిప్పారు: నాదెండ్ల మనోహర్

  • పోలవరం నిర్వాసితులను నిలువునా ముంచేశారన్న నాదెండ్ల 
  • ఏపీ బాగుండాలంటే క్విట్ జగన్ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని పిలుపు
  • అవినీతికి కేరాఫ్ అడ్రస్ వైసీపీ ప్రభుత్వమని ఆరోపణ
  • వచ్చే ఎన్నికల్లో వైసీపీ దుష్టపన్నాగాలు ఉంటాయని హెచ్చరిక
Nadendla accuses YS Jagan for not completing Polavaram

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టుపై మాట తప్పారని, మడమ తిప్పారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళవారం గుంటూరు నగర పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పోలవరం నిర్వాసితులను నిలువునా ముంచేశారన్నారు. నిన్నటి వరకు పోలవరం ప్రాజెక్టును తానే కడతానని చెప్పి, ఇప్పుడు కేంద్రం మీద నెట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుకు కేంద్రం వద్ద ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే క్విట్ జగన్ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని, వాడవాడలా ఆ నినాదంతో కార్యక్రమాలు చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో గుండాగిరి చేసేందుకు వైసీపీ స్కెచ్ వేసిందని ఆరోపించారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ వైసీపీ ప్రభుత్వమన్నారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మార్లలో భారీ కుంభకోణం జరిగిందని, రూ.22వేల కోట్ల అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. వైసీపీ దొరికిందల్లా దోచుకుంటోందన్నారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ దుష్టపన్నాగాలు ఉంటాయని కేడర్‌ను హెచ్చరించారు. పవన్ కల్యాణ్ ఇటీవల చెప్పినట్లు ఎన్నికల్లో చాలా గొడవలు జరుగుతాయన్నారు. వైసీపీకి క్షేత్రస్థాయి పరిస్థితి మెల్లిగా అర్థమవుతోందన్నారు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను వారు బలప్రదర్శనతో అడ్డుకోవాలని చూస్తారన్నారు. దీనిని జనసైనికులు సంఘటితంగా ఎదుర్కోవాలన్నారు.

More Telugu News