రజనీకాంత్ సినిమా విడుదల రోజున కార్యాలయాలకు సెలవు
- బెంగళూరు, చెన్నైలోని పలు సంస్థల నిర్ణయం
- ఉద్యోగులకు ఉచితంగా జైలర్ సినిమా టికెట్లు
- ఈ నెల 10న విడుదల కానున్న రజనీకాంత్ చిత్రం
కొన్ని సంస్థలు అయితే జైలర్ సినిమా టికెట్లను తమ ఉద్యోగులకు ఉచితంగా బుక్ చేసి పెడుతున్నాయి. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన తమన్నా భాటియా నటించింది. గురువారం ప్రపంచవ్యాప్తంగా జైలర్ విడుదల కానుంది. విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో సోషల్ మీడియాలో అభిమానుల సందడి, ఉద్వేగం కూడా పెరిగిపోతోంది. యూనో ఆక్వాకేర్ సంస్థ 10వ తేదీన సెలవు ప్రకటిస్తూ నోటీస్ ను జారీ చేసింది.
‘‘సూపర్ స్టార్ రజనీ మూవీ జైలర్ విడుదల సందర్భంగా, హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ ముందు సెలవుల కోసం అభ్యర్థనలు వెల్లువెత్తకుండా ఉండేందుకు 2023 ఆగస్ట్ 10న కార్యాలయానికి సెలవు ప్రకటిస్తున్నాం. పైరసీ నియంత్రణకు మద్దతుగా ఉద్యోగులకు ఉచితంగా టికెట్లను అందిస్తున్నాం’’ అంటూ నోటీసులో పేర్కొంది. మన తాత, మన తండ్రి, మన కుమారుడు, మన మనవడు అన్ని తరాలకు ఒకే ఒక సూపర్ స్టార్ అంటూ కొటేషన్ పెట్టేసింది.