హాలీవుడ్‌ నటికి తెలుగు నేర్పిస్తున్న ఆలియా భట్

Alia Bhatt teaches Telugu to Gal Gadot
  • ఆర్ఆర్ఆర్ తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆలియా
  • హార్ట్ ఆఫ్ స్టోన్ చిత్రంతో హాలీవుడ్‌లో అడుగు పెడుతున్న నటి
  • ప్రమోషన్స్ లో భాగంగా సహ నటి గాల్ గాడోట్‌తో తెలుగు మాటలు చెప్పించిన ఆలియా
బాలీవుడ్‌లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఆ చిత్రంలో సీత పాత్రలో తన అభినయానికి ఫ్యాన్స్‌ మంత్రముగ్ధులయ్యారు. ఆలియా ఇప్పుడు హాలీవుడ్‌లో అడుగు పెడుతోంది. 'హార్ట్ ఆఫ్ స్టోన్'తో ఆమె తెరంగేట్రం చేయనుంది. ఇందులో హాలీవుడ్‌ నటులు గాల్ గాడోట్, జామీ డోర్నన్‌లతో  తెర పంచుకోనుంది. ఈ సినిమా ఈనెల 11న విడుదల కానుంది.

ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆలియా తన సహనటి గాల్ గాడోట్‌కి తెలుగులో కొన్ని మాటలు నేర్పించి ఆకట్టుకుంది. గాడోట్‌ కూడా ఆలియా చెప్పిన తెలుగు పదాలు పలికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్‌‌ లో నటిస్తున్న సమయంలో ఆలియా కొన్ని తెలుగు పదాలు నేర్చుకుంది.
Advertisement
Alia Bhatt
RRR
Gal Gadot
Hollywood

More Telugu News