Hidimba: 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి హారర్ థ్రిల్లర్ 'హిడింబ'

  • అశ్విన్ బాబీ హీరోగా రూపొందిన 'హిడింబ'
  • జులై 20వ తేదీన విడుదలైన సినిమా
  • హారర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ  
  • ఈ నెల 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 
Hidimba OTT release date confirmed

అశ్విన్ బాబు హీరోగా గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో ' రాజుగారి గది' మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత వచ్చిన సినిమాలు అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన హారర్ థ్రిల్లర్ జోనర్లో 'హిడింబ' సినిమా చేశాడు. అశ్విన్ బాబు జోడీగా నందిత శ్వేత నటించింది.
 
ఈ సినిమా జులై 20వ తేదీన థియేటర్లకు వచ్చింది. గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాకి, అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించాడు. పోలీస్ ఆఫీసర్ గా అశ్విన్ బాబు .. అదే డిపార్టుమెంటులో పనిచేస్తున్న ఆఫీసర్ గా నందిత శ్వేత కనిపిస్తారు. అలాంటి ఈ సినిమా ఈ నెల 10వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.

'హిడింబ' అనే ఒక తెగకి చెందిన వ్యక్తులు అడవుల్లో ఎంత ప్రమాదకరంగా ఉంటారు .. ఆ తెగకి చెందిన వ్యక్తి ఈ జనారణ్యంలోకి వస్తే ఎలా ఉంటుంది? అనేదే ఈ సినిమా. కథలో సస్పెన్స్  ఉంటుంది .. యాక్షన్ ఉంటుంది. కాకపోతే హింస - రక్తపాతం చూసి తట్టుకునే స్వభావం ఉన్నవారే చూసే సినిమా  ఇది. 

More Telugu News