Karnataka: పోటీలో నెం.2గా నిలిచినందుకు 15 ఏళ్ల బాలుడి విచారం.. కాసేపటికే గుండెపోటుతో మృతి

Student dies of cardiac arrest after feeling upset over finishing second in interschool relay race in Karnataka
  • కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఘటన
  • పోటీ ముగిసిన కొన్ని నిమిషాలకే ఛాతిలో నొప్పి అంటూ కుప్పకూలిపోయిన బాలుడు
  • ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిన విద్యార్థి
  • గుండెపోటుతో విద్యార్థి మరణించినట్టు వైద్యుల వెల్లడి

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూలు పోటీల్లో తన టీం రెండో స్థానానికే పరిమితమైనందుకు విచారంలో కూరుకుపోయిన ఓ బాలుడు ఆ తరువాత కాసేపటికే గుండెపోటుతో మరణించాడు. 

జిల్లాలో ఇటీవల వివిధ స్కూళ్ల మధ్య ఆటల పోటీలు నిర్వహించారు. ఈ క్రమంలో భీమశంకర్ అనే విద్యార్థి తన టీంతో కలిసి రిలే పరుగుపందెంలో తన పాఠశాల తరపున పాల్గొన్నాడు. అయితే, ఈ పోటీలో భీమశంకర్ టీం రెండో స్థానంలో నిలిచింది. దీంతో, విద్యార్థి విచారంలో కూరుకుపోయాడు. ఆ తరువాత కొన్ని నిమిషాలకే అతడు ఛాతిలో ఇబ్బందిగా ఉందంటూ కుప్పకూలిపోయాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం బాలుడి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. 




  • Loading...

More Telugu News