గద్దర్ వంటి మహనీయుడిని కోల్పోవడం సమాజానికి తీరని లోటు: సీఎం జగన్
- తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ గద్దర్ మృతి
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం జగన్
- పేదల కోసం ఉద్యమబాట పట్టిన మహోన్నతుడు గద్దర్ అంటూ ట్వీట్
గద్దర్ మృతి పట్ల ఏపీ సీఎం జగన్ స్పందించారు. ప్రజా గాయకుడిగా తన పాటలతో పేదల్లో చైతన్యాన్ని నింపి, వారి హక్కుల సాధన కోసం ఉద్యమబాట పట్టిన మహోన్నత వ్యక్తి గద్దర్ అని అభివర్ణించారు. అటువంటి మహనీయుడిని కోల్పోవడం సమాజానికి తీరని లోటు అని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.
ఈ విషాద సమయంలో గద్దర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని వెల్లడించారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు.