Paritala sunitha: పుంగనూరు ఘటనపై నిరసనలకు అనుమతినివ్వని పోలీసులు.. జాతీయ రహదారిపై బైఠాయించిన పరిటాల సునీత

  • చిత్తూరు జిల్లా పుంగనూరులో నిన్న టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి
  • దీన్ని నిరసిస్తూ అనంతపురంలో శాంతియుత నిరసనలకు టీడీపీ పిలుపు
  • ఎక్కడికక్కడ నాయకులను గృహనిర్బంధం చేసిన పోలీసులు
  • తనను అడ్డుకోవడంతో రోడ్డుపైనే నిరసన తెలిపిన సునీత
paritala sunitha protest on national highway in chennekottapalli

చిత్తూరు జిల్లా పుంగనూరులో రాళ్ల దాడిని నిరసిస్తూ అనంతపురం జిల్లాలో టీడీపీ నాయకులు చేపట్టిన శాంతియుత నిరసనలపై పోలీసులు ఆంక్షలు విధించారు. నిరసనలకు అనుమతి లేదంటూ అడ్డగించారు. ఎక్కడికక్కడ నాయకులను గృహనిర్బంధం చేశారు. 

ఈ నేపథ్యంలో చెన్నేకొత్తపల్లిలో నిరసన తెలిపేందుకు వెళ్తున్న టీడీపీ నేత, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే పరిటాల సునీతను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనలకు అనుమతి లేదంటూ 44వ జాతీయ రహదారిపై మరూరు టోల్‌గేట్‌ వద్ద నిలిపేశారు.

శాంతియుతంగా నిరసనలు తెలిపేందుకే వెళ్తున్నామని పరిటాల సునీత చెప్పినా.. పోలీసులు అనుమతించలేదు. దీంతో సునీత రోడ్డుపైనే బైఠాయించారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు హిందూపూరంలో కూడా టీడీపీ నాయకులను అడ్డుకున్నారు.

More Telugu News