Kangana Ranaut: 'చంద్రముఖి 2' నుంచి కంగనా ఫస్టులుక్ పోస్టర్!

  • సీక్వెల్ గా రూపొందిన 'చంద్రముఖి 2' 
  • టైటిల్ రోల్ ను పోషించిన కంగనా రనౌత్
  • చాలా గ్యాప్ తరువాత లారెన్స్ చేసిన హారర్ థ్రిల్లర్  
  • సంగీతాన్ని అందించిన కీరవాణి 
  • 'వినాయక చవితి'కి భారీస్థాయి విడుదల
Chandramukhi 2 Kangana First Look Relesed

'చంద్రముఖి' సినిమా వచ్చి చాలా కాలమే అయినా, ఆ సినిమాను ప్రేక్షకులు ఇంతవరకూ మరిచిపోలేదు. రజనీకాంత్ .. నయనతార .. ప్రభు .. జ్యోతిక ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. ఈ సినిమా విజయంలో విద్యాసాగర్ సంగీతం ప్రధానమైన పాత్రను పోషించింది. 

అలాంటి ఆ సినిమాకి సీక్వెల్ గా 'చంద్రముఖి 2' రూపొందింది. మొదటి భాగాన్ని తెరకెక్కించిన పి.వాసు .. సీక్వెల్ కి కూడా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో టైటిల్ రోల్ ను కంగనా రనౌత్ పోషించింది. ఆమె పాత్రకి సంబంధించిన ఫస్టులుక్ ను కొంతసేపటి క్రితం విడుదల చేశారు. డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తలో కంగనా చాలా కొత్తగా .. బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది.

పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఉద్దేశంతోనే కంగనాను తీసుకున్నారు. ఇక మరో ప్రధానమైన పాత్రను లారెన్స్ పోషించాడు. చాలా గ్యాప్ తరువాత లారెన్స్ నుంచి వస్తున్న హారర్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించారు. 'వినాయక చవితి'కి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News