Chandrayaan 3: చంద్రయాన్-3కు ఈరోజు అత్యంత కీలకం

Chandrayan 3 to enter from earth orbit to moon orbit today
షార్ట్స్‌లో చూడండి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ లో ఈరోజ కీలక ఘట్టం చోటు చేసుకోబోతోంది. భూ కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-3 ప్రవేశించబోతోంది. ఇప్పటికే చంద్రుడి దిశగా చంద్రయాన్-3 చాలా దూరం ప్రయాణించింది. ఈ రాత్రి 7 గంటల సమయంలో ఇది చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుందని ఇస్రో తెలిపింది. 

అన్నీ సవ్యంగా జరిగితే ఈ నెల 23న చంద్రుడి ఉపరితలం పైకి స్పేస్ క్రాఫ్ట్ లోని విక్రమ్ ల్యాండర్ దిగుతుంది. చంద్రుడిపై దిగే క్రమంలో విక్రమ్ ల్యాండర్ సొంతంగా నిర్ణయాలను తీసుకోగలదని ఇస్రో తెలిపింది. చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ కు, చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ కు ఇదే ప్రధానమైన తేడా అని చెప్పింది. 

గతంలో చంద్రయాన్-2 మిషన్ ల్యాండింగ్ అయ్యే సమయంలో చంద్రుడి ఉపరితలాన్ని ల్యాండర్ బలంగా ఢీకొంది. దీంతో విక్రమ్ ల్యాండర్ లోని వ్యవస్థలు పని చేయకుండా పోయాయి. ఇప్పుడు ల్యాండర్ ను మరింత అభివృద్ధి చేసి జాబిల్లి మీదకు పంపారు.
Go Back to Shorts
Chandrayaan 3
Moon Orbit
Earth Orbit
ISRO

More Telugu News