Raghu Rama Krishna Raju: ఈ అంశం నా లాంటి క్రమశిక్షణ కలిగిన వైసీపీ కార్యకర్తలను వేధిస్తోంది: రఘురామకృష్ణ రాజు

We are concern about Jagan win in Pulivendula says Raghu Rama Krishna Raju
  • పులివెందులకు చంద్రబాబు పులిలా వెళ్లారన్న రఘురాజు
  • చంద్రబాబు సభతో పులివెందులలో పసుపు వాన కురిసిందని వ్యాఖ్య
  • పులివెందులలో జగన్ ఓడిపోతే పరిస్థితి ఏమిటనే ఆందోళన తమలో ఉందన్న రఘురాజు
టీడీపీ అధినేత చంద్రబాబు సభతో పులివెందులలో పసుపు వాన కురిసిందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. ప్రసంగం ముగించి వెళ్లిపోతున్న చంద్రబాబును అక్కడి ప్రజలు ఇంకా మాట్లాడాలంటూ ఆపారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పులివెందుల నుంచి జగన్ ఓడిపోతే పరిస్థితి ఏమిటనే ఆందోళన తనలాంటి క్రమశిక్షణ కలిగిన వైసీపీ కార్యకర్తలను వేధిస్తోందని అన్నారు. పులివెందులలో చంద్రబాబు సభ కేవలం టీజర్ మాత్రమేనని, అసలైన సినిమా ముందుందని చెప్పారు. వైనాట్ 175 అంటూ కారుకూతలు కూసిన వారికి చంద్రబాబు సభతో మైండ్ బ్లాక్ అయిందని అన్నారు. 

స్థానిక ఎమ్మెల్యేలు పులివెందులకు పరదాలు కట్టుకుని వెళ్తుంటే... చంద్రబాబు మాత్రం పులిలా వాహనమెక్కి వెళ్లారని రఘురాజు వ్యాఖ్యానించారు. ముందుగా ఊహించినట్టుగానే పులివెందుల రౌడీలు చంద్రబాబు పర్యటనకు ఆటంకాలు కలిగించేందుకు యత్నించారని... అయతే టీడీపీ శ్రేణులు వారిని తరిమికొట్టారని చెప్పారు. ఈ పరిణామాలు చూస్తుంటే రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయనే విషయం అర్థమవుతోందని అన్నారు. అమరావతి ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణాలకు ప్రజాధనాన్ని ఉపయోగించడానికి వీల్లేదని హైకోర్టు చెప్పిందని... సుప్రీంకోర్టుకు వెళ్లినా ఇదే తీర్పు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
Raghu Rama Krishna Raju
Jagan
YSRCP
Pulivendula
Chandrababu
Telugudesam

More Telugu News