అన్నను చంపినందుకు ప్రతీకారం.. వదినను హత్య చేసిన మరిది
- కుత్బుల్లాపూర్ మండలం సూరారం విశ్వకర్మ కాలనీలో ఘటన
- భర్తతో విభేదాల కారణంగా అతడిని చంపేసిన మహిళ
- బెయిల్‌పై విడుదలైన మహిళను చంపేసిన మృతుడి సోదరుడు
ఈ క్రమంలో ఫిబ్రవరి 5న మద్యం మత్తులో నిద్రపోతున్న భర్తను రేణుక, ఆ బాలికతో కలిసి చంపేసింది. తన భర్తను మరెవరో చంపేశారంటూ పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. ఆ ప్లాన్ బెడిసికొట్టడంతో చివరకు జైలు పాలైంది. అనంతరం బెయిలుపై బయటకు వచ్చింది. ఈ క్రమంలో సురేశ్ తమ్ముడు నరేశ్ రేణుకకు మంగళవారం ఫోన్ చేసి తనకు మద్యం కోసం రూ.200 కావాలని అడిగాడు. కానీ, అందరం కలిసి మద్యం సేవిద్దామని ప్రతిపాదించిన రేణుక నరేశ్ ఇంటికెళ్లింది. అప్పటికే అక్కడ మరో ముగ్గురు ఉన్నారు. అందరూ కలిసి మద్యం తాగారు. ఈ క్రమంలో మద్యం మత్తులో కూరుకుపోయిన రేణుకను ఆ నలుగురూ కలిసి చున్నీతో బిగించి చంపేశారు. రేణుకకు నరేశ్ చేసిన చివరి ఫోన్‌కాల్‌తో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది.