Team India: ఛేదనలో చివరి వరకు వచ్చి ఓడిపోయిన టీమిండియా

  • స్వల్ప స్కోర్ల మ్యాచ్ లో విండీస్ దే పైచేయి
  • తొలుత 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు చేసిన విండీస్
  • ఛేదనలో 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులు చేసిన భారత్
  • రాణించిన విండీస్ బౌలర్లు
  • 39 పరుగులు చేసిన తిలక్ వర్మ
Team India lost 1st T20 by 4 wickets

వెస్టిండీస్ తో తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 150 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేసింది. ఈ స్వల్ప స్కోర్ల మ్యాచ్ లో వెస్టిండీస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ భారత్ పై ఒత్తిడి పెంచారు. టీమిండియా ఇన్నింగ్స్ లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ చేసిన 39 పరుగులే అత్యధికం. 

ఓపెనర్లు ఇషాన్ కిషన్ (6), శుభ్ మాన్ గిల్ (3) పరుగులకే అవుట్ కావడం టీమిండియా అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. సూర్యకుమార్ యాదవ్ 21, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 19 పరుగులు చేశారు. సంజు శాంసన్ 12, అక్షర్ పటేల్ 13 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో ఒబెద్ మెకాయ్ 2, జాసన్ హోల్డర్ 2, రొమారియో షెపర్డ్ 2, అకీల్ హోసీన్ ఒక వికెట్ తీశారు. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు చేసింది. స్వల్ప స్కోరే కదా... టీమిండియా ఈజీగా గెలుస్తుందని భావించినా, విండీస్ బౌలర్లు టీమిండియా బ్యాట్స్ మెన్ కు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. 

ఈ విజయంతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో వెస్టిండీస్ 1-0తో ముందంజ వేసింది. ఇక, ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఆగస్టు 6న గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో జరగనుంది.

More Telugu News