ఏపీలో రిటర్నింగ్ అధికారుల నియామకం... 2024 ఎన్నికల తొలి అంకానికి శ్రీకారం
- ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు
- 175 నియోజకవర్గాలకు ఆర్వోల నియామకం
- గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన ఎస్ఈసీ ముఖేశ్ కుమార్ మీనా
తాజాగా, ఏపీలో రిటర్నింగ్ అధికారుల (ఆర్వో) నియమాకం జరిగింది. ఎన్నికల సంఘం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు ఆర్వోలను నియమించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాశ్ కుమార్ ఆదేశాలతో ఆర్వోల నియామకం చేపట్టారు.