Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రష్యాలో ఘోరం... యువతిని 14 ఏళ్ల పాటు చెరబట్టిన కామపిశాచి

Man imprisoned woman for 14 years
  • పోలీసుల అదుపులో 51 ఏళ్ల వ్లాదిమిర్ చెస్కిదోవ్
  • 19 ఏళ్ల వయసులో కామాంధుడి బారినపడిన ఎక్తరీనా
  • ఆమెను సెక్స్ బానిసలా వాడుకున్న దుర్మార్గుడు
  • కామాంధుడి తల్లి సాయంతో తప్పించుకున్న ఎక్తరీనా
రష్యాలో ఓ కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రష్యా పశ్చిమ భాగంలోని చెల్యాబిన్స్క్ ప్రాంతానికి చెందిన వ్లాదిమిర్ చెస్కిదోవ్ (51) ఓ యువతిని బంధించి ఏకంగా 14 ఏళ్ల పాటు ఆమెను తన లైంగిక వాంఛలకు బలి చేశాడు. 

ఎక్తరీనా అనే ఆ మహిళకు ఇప్పుడు 33 ఏళ్లు. ఇటీవల ఆ కామాంధుడి చెర నుంచి తప్పించుకున్న ఎక్తరీనా పోలీసులను ఆశ్రయించింది. 2009 నుంచి తాను చెస్కిదోవ్ వద్ద బందీగా ఉన్నానని, అతడు తనపై 1000 సార్లకు పైగా లైంగిక దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. కాగా, ఎక్తరీనా కామ పిశాచి చెస్కిదోవ్ బారి నుంచి తప్పించుకోవడానికి అతడి తల్లే సాయపడడం గమనార్హం. 

పడకగది దాటి బయటికి వెళ్లాలన్నా, చెస్కిదోవ్ కత్తితో తన వెనకాలే ఉండేవాడని, చిన్న కారణాలకు కూడా దారుణంగా శిక్షించేవాడని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. తనను సెక్స్ బానిసలా వాడుకుని, పదే పదే చిత్రహింసలకు గురి చేసేవాడని వెల్లడించింది. 

ఎక్తరీనా ఫిర్యాదు మేరకు చెల్యాబిన్స్క్ పోలీసులు చెస్కిదోవ్ ను అరెస్ట్ చేశారు. స్మోలినో అనే గ్రామంలోని అతడి నివాసం నుంచి సెక్స్ టాయ్స్, అశ్లీల సీడీలు పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. 

అంతేకాదు, ఎక్తరీనాను బంధించిన ఇంట్లోనే చెస్కిదోవ్ 2011లో ఓ మహిళను హత్య చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడా నివాసంలో సోదాల సందర్భంగా మహిళ మృతదేహం అవశేషాలు గుర్తించారు. ఆమెను కూడా చెస్కిదోవ్ బందీగా తీసుకువచ్చాడని, ఇద్దరికీ ఘర్షణ జరగడంతో, మేకులు తొలగించే పరికరంతో ఆమెను హతమార్చాడని ఎక్తరీనా పోలీసులకు తెలిపింది. 

ఎక్తరీనాకు 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చెస్కిదోవ్ తో పరిచయం ఏర్పడింది. డ్రింక్ చేద్దాం అంటూ ఇంటికి ఆహ్వానించి, ఆమెను బంధించాడు. 2009 నుంచి ఆమె ఆ మానవ మృగం చెరలోనే మగ్గిపోయింది. 

చెస్కిదోవ్ మానసిక వైకల్యంతో బాధపడుతుండడంతో, అతడిని ఆసుపత్రికి తరలించిన సమయంలో ఎక్తరీనాకు ఆ నరక కూపం నుంచి తప్పించుకునేందుకు మార్గం సుగమమైంది. 

పోలీసులు చెస్కిదోవ్ పై హత్య, అత్యాచారం, కిడ్నాప్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు పోలీసుల పర్యవేక్షణలో మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.
Vladimir Cheskidov
Ekterina
Chelyabinsk
Russia

More Telugu News