బ్రో సినిమాపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: అంబటి రాంబాబు
- ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నట్లు చెప్పిన అంబటి రాంబాబు
- కీలక విషయమై వెళ్తున్నట్లు వెల్లడి
- ఢిల్లీ నుండి వచ్చాక అన్ని విషయాలు చెబుతానన్న మంత్రి
బ్రో సినిమాకు అక్రమమార్గంలో విదేశీ పెట్టుబడులు వచ్చాయని అంబటి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఈ సినిమాకు సంబంధించి తాను చెప్పాల్సింది చెప్పానని, అలాగే బ్రో చిత్ర నిర్మాత కూడా తాను చెప్పాల్సింది చెప్పారని అన్నారు. ఈ సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ ఎవరిదో ప్రజలందరికీ తెలుసునని చెప్పారు.
బ్రో సినిమాలో తనను పోలిన పాత్ర ద్వారా కించపరిచారని అంబటి ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బ్రో సినిమా వ్యవహారంలో అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఈడీ, సీబీఐలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లుగా వార్తలు వచ్చాయి. పార్టీ ఎంపీలతో కలిసి ఆయన ఢిల్లీలో ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నారని తెలుస్తోంది.