Stock Market: అమెరికా ఎఫెక్ట్.. భారీగా పతనమైన సెన్సెక్స్

  • అమెరికా క్రెడిట్ గ్రేడ్ ను తగ్గించిన ఫిచ్ రేటింగ్స్
  • 676 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 207 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా పతనమయ్యాయి. అమెరికా క్రెడిట్ గ్రేడ్ ను ఫిచ్ రేటింగ్ తగ్గించడం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఈ క్రమంలో, ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 676 పాయింట్లు కోల్పోయి 65,782కి పడిపోయింది. నిఫ్టీ 207 పాయింట్లు పతనమై 19,526కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
నెస్లే ఇండియా (1.15%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.75%), ఏసియన్ పెయింట్స్ (0.64%), టెక్ మహీంద్రా (0.24%). 

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-3.45%), టాటా మోటార్స్ (-3.19%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.89%), ఎన్టీపీసీ (-2.69%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-2.17%).

More Telugu News