Lok Sabha: అధికారం ఉందని లోక్ సభలో బీజేపీ ఆటలాడుతోంది: కాంగ్రెస్ ఎంపీ

Lok Sabha adjourned for the day amid Opposition protest on Manipur issue
  • మణిపూర్ అంశంపై మళ్లీ వాయిదా పడిన సభ
  • ప్రధాని మోదీ ప్రకటన చేయాలని విపక్షాల డిమాండ్
  • ప్రభుత్వం కావాలని సభను వాయిదా వేస్తోందన్న అధిర్ రంజన్ చౌదరి
విపక్షాల ఆందోళన కారణంగా లోక్ సభ బుధవారం కూడా వాయిదాపడింది. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఇండియా ఫర్ మణిపూర్ ప్లకార్డులను ప్రదర్శించాయి. ప్రధాని ప్రకటన చేయాల్సిందేనని నినాదాలు చేస్తూ, వెల్‌లోకి చొచ్చుకు వచ్చారు. స్పీకర్ ఎంతగా నచ్చజెప్పినప్పటికీ విపక్ష సభ్యులు వినకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు.

సభను వాయిదా వేయడంపై కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రభుత్వం కావాలని లోక్ సభను వాయిదా వేసిందన్నారు. అధికారం ఉందని సభలో ఆటలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి కావాల్సిన బిల్లులపై చర్చ జరుపుతున్నారని, ఇందులో విపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు.

Lok Sabha
Congress
India
BJP

More Telugu News