చరణ్ కోసం 'రాధే గోవిందా' సాంగ్ రీమిక్స్ చేయాలనుందంటున్న సంగీత దర్శకుడు!

  • 'భోళాశంకర్'కి సంగీతాన్ని అందించిన మహతి స్వరసాగర్
  • తండ్రి స్వరపరిచిన 'ఇంద్ర' పాటలను గురించిన ప్రస్తావన 
  • 'రాధే గోవిందా' పాట అంటే ఇష్టమని వెల్లడి
  • ఆ పాట రీమిక్స్ లో చరణ్ బాగా చేస్తాడంటూ వ్యాఖ్య

చిరంజీవి వారసుడిగా చరణ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా, తనకంటూ ఒక స్టైల్ ను సెట్ చేసుకుని ముందుకు వెళుతున్నాడు. చిరంజీవి అంటేనే డాన్సులలో ఒక కొత్త ఒరవడిని సృష్టించిన హీరో. ఆయన తనయుడిగా వచ్చిన చరణ్ కూడా తన డాన్సులతో మెగా అభిమానులను హుషారెత్తించాడు.

గతంలో చిరంజీవి సినిమాలలో బాగా పాప్యులర్ అయిన 'బంగారు కోడి పెట్ట' .. 'వానా వానా వెల్లువాయే' పాటల రీమిక్స్ లలో చరణ్ తనదైన స్టైల్లో సందడి చేశాడు. అవకాశం వస్తే ఆయన 'రాధే గోవిందా' రీమిక్స్ లో కనిపించేలా చేస్తానని సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. 

ఆయన మాట్లాడుతూ .. "మా ఫాదర్ సంగీతాన్ని అందించిన సినిమాలలో నాకు 'ఇంద్ర' ఇష్టం .. ఆ సినిమాలోని 'రాధే గోవిందా' పాట అంటే మరింత ఇష్టం. ఆ పాటలో చిరంజీవి ఎక్స్ ప్రెషన్స్ ... స్టెప్స్ చాలా బాగుంటాయి. చరణ్ కూడా ఆ స్టెప్స్ ను చాలా బాగా వేయగలడు. అందువలన చరణ్ సినిమా చేసే ఛాన్స్ వస్తే, ఆ పాట రీమేక్స్ తప్పకుండా చేస్తాను" అంటూ చెప్పుకొచ్చాడు. 'భోళా శంకర్'కి సంగీతాన్ని అందించింది ఆయనే అనే విషయం తెలిసిందే. 


More Telugu News

Ram Charan Mahathi Swarasagar Manisharma Indra