Visakhapatnam: మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ బీభత్సం సృష్టించిన వైద్యురాలు.. చెట్టును ఢీకొట్టడంతో నుజ్జయిన కారు

Lady Doctor In Vizag Drunken Drive And Collide Bikes
  • రామాపురం నుంచి సిరిపురం వెళ్తూ అదుపుతప్పిన కారు
  • పార్క్ చేసిన ఏడు బైకులను ఢీకొట్టి ఫుట్‌పాత్‌పై ఉన్న చెట్టును ఢీకొట్టి ఆగిన కారు
  • ప్రమాదం తర్వాత మరో కారులో వెళ్లిపోయిన వైద్యురాలు
విశాఖపట్టణంలో గత రాత్రి ఓ వైద్యురాలు తాగిన మత్తులో కారు డ్రైవ్ చేస్తూ బీభత్సం సృష్టించింది. ప్రమాదం తర్వాత ఆమె మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. రామాపురం నుంచి సిరిపురం వైపు వెళ్తున్న కారు వీఐపీ రోడ్డులో ప్యారడైజ్ హోటల్ సమీపంలో అదుపుతప్పి పార్కింగ్ చేసి ఉన్న ఏడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది.

ఆ తర్వాత డివైడర్ పైనున్న చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో కారు నుజ్జుగా మారింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Visakhapatnam
Drunk Driving
Lady Doctor

More Telugu News