rbi: రూ.3.14 లక్షల కోట్ల విలువైన 88 శాతం రూ.2000 నోట్లు వెనక్కి వచ్చాయి: ఆర్బీఐ

  • డిపాజిట్ల రూపంలో 87 శాతం, మార్పిడి రూపంలో 13 శాతం వచ్చినట్లు వెల్లడి
  • మరో రూ.0.42 లక్షల కోట్లు మాత్రమే రావాలని వెల్లడి
  • ఈ ఏడాది మార్చి 31 వరకు మార్కెట్‌లో రూ.3.62 లక్షల కోట్ల రూ.2వేల నోట్లు
Rs 2000 notes denomination valuing Rs 314 lakh crore returned to banks RBI

జులై 31, 2023 నాటికి రూ.3.14 లక్షల కోట్ల విలువైన 88 శాతం రూ.2000 నోట్లు బ్యాంకులకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం వెల్లడించింది. వెనక్కి వచ్చిన మొత్తంలో 87 శాతం డిపాజిట్ల రూపంలో, 13 శాతం నోట్లతో మార్పిడి చేసుకున్నట్లు తెలిపింది. మరో రూ.0.42 లక్షల కోట్లు రావాల్సి ఉందని వెల్లడించింది.

ఈ ఏడాది మార్చి 31 వరకు మార్కెట్‌లో రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు చలామణిలో ఉండగా, మే 19 నాటికి రూ.3.56 లక్షల కోట్లకు తగ్గినట్లు తెలిపింది. మే 19న రూ.2వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అదే నెల 23 నుంచి ఉపసంహరణ ప్రారంభమైంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు నోట్లను మార్చుకోవచ్చు. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో రూ.2000 నోట్లు వెనక్కి వచ్చాయి.

More Telugu News