అంబటి రాంబాబుకు మరోసారి కౌంటర్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్
- అంబటి మీద జోకులు వేసేలా తమ సినిమాలో చేయలేదన్న సాయితేజ్
- సినిమాను సినిమాగానే చూడాలని వ్యాఖ్య
- చిరంజీవి మామయ్యతో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానన్న తేజూ
తనకు రాజకీయ అనుభవం లేదని... తమ కుటుంబ సభ్యులందరూ మామయ్య పవన్ కల్యాణ్ కు సపోర్ట్ చేస్తామని తేజూ చెప్పాడు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని తెలిపాడు. పెద్ద మామయ్య చిరంజీవితో కలిసి నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక షార్ట్ ఫిలిం చేశామని... దాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల చేస్తామని తెలిపాడు.