Ram Charan: 14 ఏళ్లను పూర్తి చేసుకున్న 'మగధీర'

  • 2009 జులై 31న వచ్చిన 'మగధీర'
  • చరణ్ కెరియర్లో ఈ సినిమా స్థానం ప్రత్యేకం
  • రాజమౌళి సత్తాను చాటిన ఆవిష్కరణ 
  • ప్రధానమైన బలంగా నిలిచిన కీరవాణి బాణీలు
 14 Years for Magadheera

చరణ్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో 'మగధీర' ఒకటి. ఆయన ఎన్ని సినిమాలు చేసినా ఈ సినిమాకి ఉండవలసిన ప్రత్యేకత ఉంటూనే ఉంటుంది. అలాంటి ఈ సినిమా నిన్నటితో 14 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. 2009 జులై 31వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. విజయేంద్ర ప్రసాద్ అందించిన ఈ కథను రాజమౌళి తెరకెక్కించారు. 

అల్లు అరవింద్ - బీవీఎస్ ఎన్ ప్రసాద్ కలిసి నిర్మించిన సినిమా ఇది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాలో, చరణ్ సరసన నాయికగా కాజల్ అలరించింది. ఈ కథ అటు రాజుల కాలంలో .. ఇటు ప్రస్తుత కాలంలోను నడుస్తుంది. పైగా పునర్జన్మలతో ముడిపడి ఉంటుంది. తన కెరియర్లో తొలి అడుగులు వేస్తున్న చరణ్ ను నిలబెట్టేసిన సినిమా ఇది. 

ఇక దర్శకుడిగా రాజమౌళి ఎంతటి భారీ సినిమాలనైనా తెరకెక్కించగలడనే నమ్మకం ఈ సినిమాతోనే జనాలకు కలిగింది. కథాకథనాలతో పాటు, ఈ సినిమా కోసం కీరవాణి స్వరపరిచిన పాటలు కూడా సక్సెస్ లో ప్రధానమైన పాత్రను పోషించాయి. అలాంటి ఈ సినిమా 14 ఏళ్లను పూర్తిచేసుకోవడంతో, అభిమానులు ఆ సినిమా విశేషాలను నెమరువేసుకుంటున్నారు.

More Telugu News