TET: తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే!

  • సెప్టెంబర్ 15న టెట్ పేపర్‌–1, పేపర్ –2 పరీక్షలు 
  • రేపటి నుంచి ఈనెల 16 దాకా దరఖాస్తులు
  • పరీక్షలకు రెండున్నర లక్షల మంది దాకా హాజరయ్యే అవకాశం
telangana state teacher eligibility test notification released exam will be conducted on september 15th

తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 15న టెట్ పేపర్‌–1, పేపర్ –2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి ఈ మేరకు దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ నెల 16వ తేదీ దాకా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. https://tstet.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయవచ్చు. ఒక్కో పరీక్ష ఫీజు రూ.400.

పేపర్–1 పరీక్షను డీఈడీ, బీఈడీ అభ్యర్థులు రాసుకునేందుకు అవకాశం కల్పించారు. బీఈడీ చేసిన వాళ్లు రెండు పేపర్లను రాసుకోవచ్చు. ఈ సారి టెట్‌ పరీక్షకు 2 లక్షల నుంచి రెండున్నర లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 15న పరీక్ష నిర్వహించి, అదే నెల 27న ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

More Telugu News