Shubhman Gill: ప్రపంచ రికార్డు సృష్టించిన శుభ్ మన్ గిల్

  • వన్డేల్లో 26 ఇన్నింగ్స్ లలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ గా గిల్
  • 26 ఇన్నింగ్స్ లలో 1,352 పరుగులు సాధించిన యువ బ్యాట్స్ మెన్
  • పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజమ్ పేరిట ఉన్న రికార్డు కనుమరుగు
Shubhman Gill creates world record

వెస్టిండీస్ తో రెండో వన్డేలో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ... భారత్ యువ బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ ఒక ప్రపంచ రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్ లో 34 పరుగులు చేసిన శుభ్ మన్... పాకిస్థాన్ సూపర్ స్టార్ బాబర్ ఆజమ్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును బద్దలు చేశాడు. వన్డేల్లో 26 ఇన్నింగ్స్ లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. 26 ఇన్నింగ్స్ లలో గిల్ 1,352 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో బాబర్ పేరిట ఉన్న 1,322 పరుగుల రికార్డును అధిగమించాడు. తద్వారా ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ జాబితాలో టాప్ ఫైవ్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ జొనాథన్ ట్రాట్ (1,303 పరుగులు), పాకిస్థాన్ ప్లేయర్ ఫకర్ జమాన్ (1,275), దక్షిణాఫ్రికా ఆటగాడు వాన్ డర్ దస్సేన్ (1,267) ఉన్నారు. 

రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 40.5 ఓవర్లలో 181 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ శుభారంభాన్ని అందించారు. ఒకానొక సమయంలో వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసిన భారత్... ఆ తర్వాత 181 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ 36.4 ఓవర్లలో నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. వన్డే ప్రపంచ కప్ కు క్వాలిఫై కాలేని వెస్టిండీస్ లాంటి బలహీన జట్టుపై దారుణంగా ఓడిపోయిన టీమిండియా విపరీతమైన ట్రోల్స్ ను ఎదుర్కొంటోంది.

More Telugu News