Srikanth: 'మలయాళ హిట్ మూవీ రీమేక్ గా 'కోట బొమ్మాళి' .. మోషన్ పోస్టర్ రిలీజ్!

  • గీతా ఆర్ట్స్ 2 నుంచి వస్తున్న 'కోట బొమ్మాళి'
  • ఆసక్తికరంగా సాగే పోలీస్ డ్రామా ఇది 
  • మలయాళంలో హిట్ కొట్టిన 'నయట్టు'కి రీమేక్ 
  • కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్    
Kota Bommali Motion Poster Released

గీతా ఆర్ట్స్ 2 నుంచి మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకి, తేజ మార్ని దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి 'కోట బొమ్మాళి .. పీఎస్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అంటే 'కోట బొమ్మాళి' లోని పోలీస్ స్టేషన్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ ను వదిలారు.

శ్రీకాంత్ .. రాహుల్ విజయ్ .. శివాని రాజశేఖర్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ ముగ్గురూ కూడా ఈ సినిమాలో పోషించింది పోలీస్ పాత్రలే. 2021 ఏప్రిల్లో మలయాళంలో వచ్చిన 'నయట్టు' సినిమాకి ఇది రీమేక్. చాలా తక్కువ పాత్రలతో .. తక్కువ బడ్జెట్ లో అక్కడ పెద్ద హిట్ కొట్టిన సినిమా అది. జోజు జార్జ్ .. కుంచకో బోబన్ .. నిమిషా సాజయన్ అక్కడ ప్రధానమైన పాత్రలను పోషించారు. 

ఒక రోడ్డు యాక్సిడెంట్ ను పోలీసులే కావాలని చేశారనే అనుమానాలు బలపడతాయి. తమని అరెస్టు చేస్తారని భయపడిన ఆ ముగ్గురు పోలీసులు పారిపోతారు. వాళ్లని పట్టుకోవడానికి మిగతా డిపార్టుమెంట్ రంగంలోకి దిగుతుంది. ఇలా పోలీసులను పోలీసులే వెంటాడే ఒక ఆసక్తికరమైన కథ ఇది. ఈ ముగ్గురు పోలీసులను భయంతో పరుగులు తీయించే ఆఫీసర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది.

More Telugu News