'బ్రో'లో అంబటిని టచ్ చేసేలా సీన్.. పవన్ పై అంబటి హాట్ ట్వీట్
- గెలిచినోడి డాన్స్ సంక్రాంతి అంటూ అంబటి ట్వీట్
- గతంలో సంక్రాంతి రోజున డాన్స్ చేసిన అంబటి
- ఆ డాన్స్ ను టచ్ చేసేలా 'బ్రో' చిత్రంలో సన్నివేశం
ఇలాంటి సన్నివేశమే ఎవరినీ ప్రత్యేకంగా టార్గెట్ చేయని విధంగా ఈ చిత్రంలో ఉంది. అంబటి వేసిన విధంగానే నటుడు పృథ్వీతో డ్యాన్స్ చేయించారు. అంతేకాదు ఆరోజున అంబటి వేసుకున్న డ్రెస్ నే పృథ్వీకి ధరింపజేశారు. ఈ సందర్భంగా పవన్ కొట్టే డైలాగ్ కూడా అంబటికి సూటిగా తగిలేలా ఉంది. శ్యాంబాబు.. వస్తున్న టెంపో ఏమిటి? నువ్వు వేస్తున్న స్టెప్పులు ఏమిటి? అని పవన్ ప్రశ్నిస్తారు. ఈ సీన్ నేపథ్యంలోనే అంబటి ట్వీట్ చేశారని భావిస్తున్నారు.