పురందేశ్వరి గారూ... మీరు కూడా చంద్రబాబు మాయలో పడతానంటే మీ ఇష్టం: మంత్రి అమర్నాథ్
- ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలిగా పురందేశ్వరి
- వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు
- మరిది చంద్రబాబు స్క్రిప్టునే చిన్నమ్మ చదువుతున్నారన్న మంత్రి అమర్నాథ్
- పురందేశ్వరి టీడీపీ అధ్యక్షురాలైతే బాగుంటుందని వ్యంగ్యం
'పురందేశ్వరి తండ్రి స్థాపించిన పార్టీని ఇప్పుడు మరిది నడుపుతున్నారు... వీళ్లేమో వేరే పార్టీని నడుపుతున్నారు' అంటూ గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.
మరిది స్క్రిప్టునే పురందేశ్వరి మాట్లాడుతున్నారని, ఇంతకీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మీరా? చంద్రబాబా? అనేది చెప్పాలన్నారు. లేకపోతే, పురందేశ్వరి టీడీపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుని మాట్లాడితే బాగుంటుందని వ్యంగ్యం ప్రదర్శించారు.