Ravindra Jadeja: నిన్నటి వన్డేలో రెండు రికార్డులు సృష్టించిన రవీంద్ర జడేజా

  • తొలి వన్డేలో విండీస్ పై ఘన విజయం సాధించిన ఇండియా
  • విండీస్ పై వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా అవతరించిన జడేజా
  • భారత్-వెస్టిండీస్ మధ్య అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా వాల్ష్ రికార్డు సమం చేసిన వైనం
Ravindra Jadeja new records

వెస్టిండీస్ తో నిన్న జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బౌలింగ్ చేసిన ఇండియా 114 పరుగులకే విండీస్ ను కట్టడి చేసింది. విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ (43) మినహా మరెవరూ ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు, జడేజా 3 వికెట్లు తీసి వెస్టిండీస్ బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 52 పరుగులు సాధించాడు. 

ఈ మ్యాచ్ లో జడేజా రెండు అరుదైన రికార్డులను సాధించాడు. వెస్టిండీస్ పై వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా అవతరించాడు. విండీస్ పై వన్డేల్లో ఇప్పటి వరకు జడేజా 44 వికెట్లు తీశాడు. ఈ రికార్డు ఇప్పటి వరకు కపిల్ దేవ్ (43) పేరిట ఉంది. అంతేకాదు భారత్-వెస్టిండీస్ మధ్య వన్డేల్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా విండీస్ దిగ్గజం కోర్ట్నీ వాల్ష్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.

More Telugu News