Samudrakhani: ఎన్నో కష్టాల తరువాత నేను తెలుసుకున్న నిజం ఇదే: 'బ్రో' డైరెక్టర్ సముద్రఖని

  • తన కష్టాలను గురించి ప్రస్తావించిన సముద్రఖని
  • అనుభవం తనకి నేర్పిన సత్యం ఇదేనని వెల్లడి
  • అదే 'బ్రో' సినిమా ద్వారా చెప్పానని వ్యాఖ్య 
  • ప్రతిఒక్కరికీ కనెక్ట్ అవుతుందని వివరణ  
Samudrakhani Interview

నటుడిగా .. రచయితగా .. దర్శకుడిగా సముద్రఖనికి మంచి పేరు ఉంది. ఈ మధ్య కాలంలో నటుడిగా తెలుగులోనూ బిజీ అయిన ఆయన, దర్శకుడిగా పవన్ కల్యాణ్ - సాయితేజ్ తో 'బ్రో' సినిమాను రూపొందించాడు. తమిళంలో 'వినోదయా సితం' చేసిన ఆయనకి అక్కడ హిట్ దొరికింది. అదే కథను ఆయన తెలుగులో రీమేక్ చేశాడు. తాజాగా గ్రేట్ ఆంధ్రకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సముద్రఖని మాట్లాడాడు. 

"చెన్నైకి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఊరు మాది. మా ఇంటి దగ్గరి వరకూ నా కారు కూడా వెళ్లదు .. కొంత దూరంలోనే దిగేసి నడుస్తూ వెళ్లాలి. అలాంటి స్థితి నుంచి ఈ రోజున ఈ స్థాయికి రావడానికి కారణం కాలం .. అదే ఎవరినైనా నడిపించేది. నిన్న అనేది జరిగిపోయింది .. రేపు అనేది ఒక ఆశ మాత్రమే .. ఉన్నది ఈ రోజే .. హ్యాపీగా గడిపేయడమే మంచిది అనేది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను" అన్నారు. 

"డబ్బున్న వాళ్లలో కూడా చాలామంది ప్రశాంతంగా ఉండకపోవడం నేను గమనించాను. ఓ పదేళ్లకు ముందే ప్లాన్ చేసి పెట్టేస్తారు. ఏదో అనుకుంటే .. ఇంకేదో జరుగుతుంది. జీవితం చాలా చిన్నది .. అతిగా ఆలోచించకు .. హాయిగా గడిపేయ్ అనేదే 'బ్రో' సినిమా ద్వారా నేను చెప్పింది. ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది" అంటూ చెప్పుకొచ్చారు సముద్రఖని.

More Telugu News