Rajinikanth: శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ విమానంలో రజనీకాంత్... థ్రిల్లయిన సిబ్బంది

  • మాల్దీవుల పర్యటనకు వెళ్లిన సూపర్ స్టార్ రజనీకాంత్ 
  • రెండు వారాల టూర్ అనంతరం నేడు తిరిగి రాక
  • రాను, పోను శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణం
Rajinikanth onboard Sri Lankan Airlines plane to arrive Chennai from Male

దక్షిణాది సినీ సూపర్ స్టార్ రజనీకాంత్ మాల్దీవుల పర్యటన ముగించుకుని చెన్నై తిరిగొచ్చారు. ఆయన మాల్దీవులకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ విమానంలోనే ప్రయాణించారు. ఈ నెల 14న చెన్నై నుంచి మాలే వెళ్లిన ఆయన ఇవాళ తిరిగి చెన్నై చేరుకున్నారు. 

ఈ రెండు సందర్భాల్లో శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ సిబ్బంది రజనీ తమ విమానంలో ప్రయాణం చేయడం పట్ల థ్రిల్లయ్యారు. ఎయిర్ హోస్టెస్ లు, ఇతర విమాన సిబ్బంది కూడా రజనీతో ఫొటోలు దిగేందుకు పోటీలు పడ్డారు. ఈ ఫొటోలను శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ ట్విట్టర్ లో పంచుకుంది. 

భవిష్యత్ లోనూ రజనీకాంత్ తమ విమానాల్లోనే ప్రయాణం చేయాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆ శ్రీలంక విమానయాన సంస్థ పేర్కొంది.

More Telugu News