Telangana: తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షాలు.. ములుగులో 65 సెంటీమీటర్ల వర్షపాతం

  • సీజన్‌లోనే అత్యధిక వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం వెల్లడి
  • 24 గంటల్లో ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో అత్యధికంగా 649.8 మిల్లీమీటర్ల వర్షపాతం
  • పలు జిల్లాల్లోని 20 చోట్ల 230 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు
Extremely Heavy Rain Fall observed In Telangana

తెలంగాణలో కొన్ని రోజులుగా కురుస్తున్న నిరంతర వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు, వరదలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో పలు ప్రాంతాల్లో ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు జిల్లాలోని వెంకటాపూర్‌‌ మండలం లక్ష్మీదేవిపేటలో అత్యధికంగా 649.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

జయశంకర్ జిల్లా చిట్యాల్‌ మండలం చిట్యాల్‌ 616.5 మి.మీలతో రెండో స్థానంలో నిలిచింది. అదే జిల్లాలోని ఘన్‌పూర్‌‌ మండలం చెల్పూర్‌‌లో 475.8 మి.మీ, రేగొండ మండలంలో 467.0 మి.మీ, మొగుళ్లపల్లిలో 394 మి.మీ వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కర్కగూడెంలో 390 మి.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. కరీంనగర్‌‌, హన్మకొండ, ఆదిలాబాద్, వరంగల్‌, జనగాం జిల్లాల్లోని పలు ప్రాంతాలు సహా 20 చోట్ల 230 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.

More Telugu News