బైక్ ను తప్పించే ప్రయత్నంలో యువతులను ఢీ కొట్టిన కారు.. వీడియో ఇదిగో!
- రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న విద్యార్థినులు
- వేగంగా దూసుకొచ్చి ఢీ కొట్టడంతో ఎగిరిపడ్డ యువతి
- బైకర్ తో పాటు యువతికి స్వల్ప గాయాలు..
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
ఈ నెల 18న రాయ్ చూర్ లోని రాఘవేంద్ర పెట్రోల్ పంప్ దగ్గర్లో ఈ ప్రమాదం జరిగింది. జంక్షన్ వద్ద ఎదురుగా వస్తున్న కారును గమనించకుండా ఓ బైకర్ యూటర్న్ తీసుకున్నాడు. అప్పటికే చాలా దగ్గరగా వచ్చేసిన కారు డ్రైవర్ ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో తొలుత బైక్ ను ఆపై రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళుతున్న విద్యార్థులను ఢీ కొట్టాడు. కారు వేగానికి ఓ స్టూడెంట్ దూరంగా ఎగిరి పడింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని స్థానిక అధికారులు తెలిపారు.