Shashi Preetham: 'గులాబి' వలన నాకు అవార్డులు రాలేదు .. రివార్డులు రాలేదు: సంగీత దర్శకుడు శశిప్రీతమ్

Shashi Preetham Interview
  • 1995లో విడుదలైన 'గులాబి'
  • మ్యూజికల్ హిట్ గా నిలిచిన సినిమా 
  • ఆ పాటలు ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నారని వెల్లడి
  • అవకాశాలు .. రాజకీయాలను గురించి ఆలోచించలేదని వ్యాఖ్య   
రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో .. కృష్ణవంశీ దర్శకత్వంలో 'గులాబి' సినిమా రూపొందింది. జేడీ చక్రవర్తి - మహేశ్వరి జంటగా నటించిన ఈ సినిమా, భారీ విజయాన్ని నమోదు చేసింది. 1995లో విడుదలైన ఈ సినిమాకి, శశిప్రీతమ్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలోని 'మేఘాలలలో తేలిపొమ్మన్నది' సాంగ్ అప్పటికీ .. ఇప్పటికీ సూపర్ హిట్. 

తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శశిప్రీతమ్ మాట్లాడుతూ .. "చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. అదే నన్ను సినిమాల దిశగా నడిపించింది. 'గులాబి' సినిమా పాటల పరంగా నాకు ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ సినిమా విడుదలై ఇంతకాలమైనా, ఇప్పటికీ అభినందిస్తూ మెసేజ్ లు వస్తూనే ఉంటాయి" అన్నారు. 

'గులాబి' సినిమా అంత హిట్ అయినప్పటికీ ఆ సినిమా వలన నాకు అవార్డులు రాలేదు .. రివార్డులు రాలేదు. నేను అడగలేదు కూడా. నా కెరియర్ గ్రాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోవడానికి కారకులు ఎవరు? నాకు వచ్చే అవకాశాలను అడ్డుకున్నవారెవరు? అనే విషయాలను గురించి నేను ఎప్పుడూ ఆలోచన చేయలేదు. హిందీ సినిమాల వలన మాత్రం నాకు వర్క్ వచ్చింది .. డబ్బు కూడా వచ్చింది" అంటూ చెప్పుకొచ్చారు. 

Shashi Preetham
JD Chakravarthi
Maheshwari
Gulabi

More Telugu News