ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని జీహెచ్ఎంసీ వార్డు ఆఫీస్‌లో పామును వదిలిన యువకుడు
- అల్వాల్ జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయంలో ఘటన
- వర్షాలతో ఓ వ్యక్తి ఇంట్లోకి వచ్చిన పాము
- జీహెచ్ఎంసీ సిబ్బందికి ఫిర్యాదు చేసిన కుటుంబం
ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసి గంటలు గడిచినా కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది పట్టించుకోకపోవడం ఆ కుటుంబంలోని ఓ యువకుడికి కోపం తెప్పించింది. సదరు పామును పట్టుకుని జీహెచ్ఎంసీ వార్డు ఆఫీసుకి తెచ్చి వదిలాడు. ఆఫీసులోని టేబుల్‌పై పామును వదిలి నిరసన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.