Vijayasai Reddy: పార్లమెంటు సమావేశాలను విపక్షాలు అడ్డుకోవడంపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

YSRCP is against to blocking of Parliament says Vijayasai Reddy
  • మణిపూర్ అంశంపై అట్టుడుకుతున్న పార్లమెంటు
  • పార్లమెంటును స్తంభింపజేయడాన్ని వైసీపీ సమర్థించదన్న విజయసాయి
  • మణిపూర్ అంశం దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన విషయమని వ్యాఖ్య
మణిపూర్ అంశంపై పార్లమెంటు అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోవైపు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటును స్తంభింపజేయడాన్ని వైసీపీ సమర్థించదని చెప్పారు. మణిపూర్ అంశంపై చర్చకు సిద్ధమని, తాము సమాధానం చెపుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారని తెలిపారు. ఇలాంటప్పుడు ఉభయ సభలు కొనసాగకుండా అడ్డుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. మణిపూర్ అంశం దేశ అంతర్గత భద్రతకు చెందిన అంశమని... ఇది పూర్తిగా కేంద్ర హోం శాఖ పరిధిలో ఉంటుందని చెప్పారు.
Vijayasai Reddy
YSRCP
Parliament
Amit Shah
BJP

More Telugu News