Pawan Kalyan: మహేశ్ – రాజమౌళి సినిమాపై పవన్‌ కల్యాణ్​ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan interesting comments on Mahesh Rajamouli movie
  • ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌తో తెలుగు సినిమా ఖ్యాతిని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లారని రాజమౌళిపై ప్రశంసలు
  • మహేశ్  తో సినిమా ఇంకా పెద్ద స్థాయికి వెళ్లాలన్న పవన్‌
  • ఖుషీ అవుతున్న మహేశ్ బాబు ఫ్యాన్స్‌
పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్  కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'బ్రో'. ఈ శుక్రవారం (జులై 28) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సముద్రఖని దర్శకుత్వం వహించిన చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. నిన్న రాత్రి హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన పవన్ తెలుగు పరిశ్రమలో ప్రతి అగ్ర నటుడితో తాను స్నేహంగా ఉంటానని, వారి సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటానని చెప్పారు. దర్శకుడు రాజమౌళి తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు.

అలాగే మహేశ్ బాబుతో ఆయన చేయబోయే సినిమానూ ప్రస్తావించారు. మహేశ్ – రాజమౌళి సినిమా ఇంకా పెద్ద స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నానని చెప్పారు. దీనిని కొత్తగా వచ్చేవాళ్ళు కొనసాగించాలన్నారు. తనకు అందరు హీరోలు ఇష్టమని, వారివల్ల ఎందరో కడుపు నిండుతుందని చెప్పుకొచ్చారు. మహేశ్ గురించి పవన్ ప్రస్తావించడంతో ఆయన ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. మహేశ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్రం ముగిసిన తర్వాత రాజమౌళి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.
Pawan Kalyan
Rajamouli
Mahesh Babu
bro
movie
Tollywood
Hollywood

More Telugu News