Rice: ఆస్ట్రేలియాలోనూ అదే తంతు... బియ్యం కోసం ఎగబడుతున్న భారతీయులు

  • దేశంలో చుక్కలనంటుతున్న ధరలు
  • చర్యలకు నడుంబిగించిన కేంద్రం
  • బాస్మతీయేతర రకాల బియ్యం ఎగుమతులపై నిషేధం
  • బియ్యాన్ని పెద్ద ఎత్తున నిల్వ చేసుకునేందుకు విదేశాల్లోని భారతీయుల యత్నం
Indians rushing to buy rice in Australia also

దేశంలో ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం చర్యలకు ఉప్రకమించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బాస్మతీయేతర బియ్యం ఎగుమతులను నిషేధిత జాబితాలో చేర్చింది. కేంద్రం నిర్ణయంతో విదేశాల్లో భారతీయుల బియ్యం కోసం ఎగబడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 

ఇటీవల అమెరికాలోని డిపార్టమెంటల్ స్టోర్ల వద్ద విపరీతమైన రద్దీ కనిపించింది. భారత్ బియ్యం ఎగుమతులను నిషేధించిందన్న వార్తలతో అమెరికాలోని భారతీయులు బియ్యం పెద్ద ఎత్తున నిల్వ చేసుకునేందుకు పోటీలుపడ్డారు. ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. 

సాధారణంగా ఓ నెలలో కొనే బియ్యానికి రెట్టింపు పరిమాణంలో భారతీయులు బియ్యం కొనుగోలు చేస్తున్నారని ఆస్ట్రేలియాలోని సర్రే హిల్స్ లో ఉన్న ఎంజీఎం స్పైసెస్ అనే కిరాణా స్టోర్ మేనేజర్ శిశిర్ శర్మ వెల్లడించారు. 

గత కొన్ని రోజులుగా బియ్యం కొనుగోళ్లు బాగా పెరిగాయని వివరించారు. దాంతో తాము డిమాండ్ ను నియంత్రించేందుకు ఒక వ్యక్తికి 5 కిలోల బియ్యం మాత్రమే అమ్ముతున్నామని తెలిపారు. చాలామంది భారతీయులు తమ నిర్ణయం పట్ల తిరగబడుతున్నారని, అయినప్పటికీ తాము ఒకరికి 5 కిలోలకు మంచి అమ్మడంలేదని ఆ మేనేజర్ స్పష్టం చేశారు.

More Telugu News