5G smartphones: 5 జీ ఫోన్లపై అమెజాన్ అదిరిపోయే ఆఫర్లు

  • టాప్ బ్రాండ్లపై రూ.3 వేల నుంచి రూ.10 వేల దాకా డిస్కౌంట్
  • పాత స్మార్ట్ ఫోన్లతో ఎక్స్ చేంజ్ చేసుకునే సదుపాయం
  • రూ.25 వేల లోపు బడ్జెట్ లో బెస్ట్ 5 జీ ఫోన్ సొంతం చేసుకోవచ్చు
Amazing offers on 5G smartphones on amazon

మార్కెట్లో అందుబాటులో ఉన్న 5 జీ ఫోన్లపై ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ పాం అమెజాన్ అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. టాప్ బ్రాండ్ ల స్మార్ట్ ఫోన్ ను అతి తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. బ్రాండ్ ను బట్టి 5 జీ స్మార్ట్ ఫోన్లపై రూ.3 వేల నుంచి రూ.10 వేల దాకా డిస్కౌంట్ ఇస్తోంది. అంతేకాదు, మీ పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ చేంజ్ చేసుకునే సదుపాయం కూడా కల్పించింది.

5జీ స్మార్ట్ ఫోన్లు.. డిస్కౌంట్లు

శామ్‌సంగ్‌ గేలాక్సీ ఎం34 5జీ
ఈ స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ 19 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఫోన్ ధర రూ.20,999 కాగా డిస్కౌంట్, బ్యాంకు ఆఫర్లతో రూ.17,999 లకే సొంతం చేసుకోవచ్చు. దీనికి ఎక్స్ చేంజ్ ఆఫర్ అదనం. సిల్వర్‌ ప్రిజమ్‌ కలర్‌ లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 

  • 8జీబీ ర్యామ్‌
  • 128జీబీ ఇంటర్నల్‌ మెమరీ
  • 120హెర్జ్‌ రిఫ్రెష్‌మెంట్‌ రేట్‌ తో కూడిన అమోల్డ్‌ డిస్‌ ప్లే
  • 50ఎంపీ ట్రిపుల్‌ నో షేక్‌ కెమెరా 
  • 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

రియల్‌మీ నార్జో 60 ప్రో
ఈ ఫోన్ ధర రూ.26,999 కాగా అమెజాన్ 11 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో పాటు ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా వినియోగించుకుంటే రూ.21,650 లకే కొనుగోలు చేయవచ్చు. ఫీచర్లు..
  • 8జీబీ ర్యామ్‌
  • 128జీబీ ఇంటర్నల్‌ మెమరీ
  • మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 చిప్‌
  • 120హెర్జ్‌ సూపర్‌ అమోల్డ్‌ కర్వడ్‌ డిస్‌ ప్లే
  • 100ఎంపీ ఓఐఎస్‌ కెమెరా
  • 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

రెడ్‌మీ కే50ఐ 5జీ
ఈ ఫోన్ అసలు ధర రూ.31,999. దీనిపై అమెజాన్ లో ఏకంగా 34 శాతం డిస్కౌంట్ ఉంది. అంటే.. ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.20,999 లకే సొంతం చేసుకోవచ్చు. బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా వినియోగించుకుంటే ఇంకా తక్కువకే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు..
  • 6జీబీ ర్యామ్‌
  • 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • మీడియాటెక్‌ డైమెన్సిటీ చిప్‌
  • 144 హెర్జ్‌ లిక్విడ్‌ ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ డిస్‌ ప్లే

వన్‌ ప్లస్‌ నార్డ్‌ సీఈ 3 లైట్‌ 5జీ
ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్‌లో కేవలం రూ.21,999కే లభిస్తోంది. పలు బ్యాంకు ఆఫర్లతో పాటు ఎక్స్‌ చేంజ్‌ ఆఫర్లతో మరింత తక్కువ ధరకే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే..
  • క్వాల్‌కామ్‌ స్నాప్ డ్రాగన్‌ 695 5జీ ప్రాసెసర్‌
  • 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • 67వాట్ల సూపర్‌ వీఓఓసీ చార్జర్‌ 
  • 8జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ మెమరీ

ఒప్పో ఎఫ్‌23 5జీ
ఈ ఫోన్‌ అసలు ధర రూ.28,999 కాగా అమెజాన్ 14 శాతం డిస్కౌంట్ తో రూ.24,999 లకే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపిక చేసిన బ్యాంకు క్రెడిట్ కార్డులతో రూ.2,500 వరకు తగ్గింపు పొందొచ్చు. ఫీచర్లు..

  • 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • 67వాట్ల సూపర్‌ వీఓఓసీ చార్జర్‌
  • 64ఎంపీ రియర్‌ ట్రిపుల్‌ ఏఐ కెమెరా
  • 6.72 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ 120 హెర్జ్‌ డిస్‌ ప్లే

More Telugu News